Niharika: టార్గెట్ ‘కుర్రోళ్లే’.. నిహారిక సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
Niharika New movie to have Committee Kurrallu as title: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక గతంలో హీరోయిన్ గా పరిచయమైంది కానీ ఎక్కువగా నిర్మాతగానే సినిమాలు చేస్తూ వస్తోంది. హీరోయిన్గా చేసిన ఒకటి రెండు సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో నిర్మాణం వైపే మొగ్గు చూపుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసి పలు సినిమాలు నిర్మిస్తూ ఆల్రెడీ నిర్మించిన పలు సినిమాలను ప్రమోట్ చేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆమె గత ఏడాది యదు వంశీ అనే కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
Also Read
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద నిహారిక తల్లి పద్మజ, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకి ‘కమిటీ కుర్రాళ్లు’ టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే టీమ్ ఫిల్మ్ ఛాంబర్లో ఈ మేరకు ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారని, అఫీషియల్ గా చెప్పకపోయినా అది ఈ సినిమా కోసమేనని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా హీరోయిన్లు కూడా ఎక్కువగా ఉండే ఉంటారని టాక్ వినిపిస్తోంది. దాదాపు ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకు సింగర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనుదీప్ దేవ్ సంగీతం అందించబోతున్నారు.
తాజావార్తలు
-
SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
-
Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
-
Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
-
Sai Sudharsan: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. ఐపీఎల్ హిస్టరీలో నయా రికార్డ్.. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్
-
Soya Chunks: హై ప్రోటీన్.. అదిరిపోయే టేస్ట్! 10 నిమిషాల్లో సింపుల్గా కర్రీని ఇలా వండేయండి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!