NTV Telugu Site icon

Niharika-Allu Arjun: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక సమాధానం ఇదే!

Niharika About Allu Arjun

Niharika About Allu Arjun

Niharika Konidela React on Allu Arjun and Sai Dharam Tej Issue: దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలామంది కొత్త నటులతో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నిహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ గురించి స్పందించారు.

ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్‌ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం అల్లు అర్జున్‌ను మెగా హీరో సాయి తేజ్‌ సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేశారు. దాంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్‌ ఫాలో అవుతున్నారు. సాయి తేజ్‌ తప్ప మిగతా మెగా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.

Also Read: IND vs CAN: నేడు కెనడాతో భారత్‌ ఢీ.. కళ్లన్నీ అతడిపైనే!

ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల తాజాగా స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఈ విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. అల్లు అర్జున్‌, సాయి తేజ్‌ విషయం గురించి తనకు ఇంకా తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ… ‘ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని చూసినట్టుగా అనిపించింది. ఎమోషన్స్‌ అందరికీ కనెక్ట్‌ అవుతాయి’ అని అన్నారు.