Niharika : ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వేడుక నిర్వాహకులపై మెగా డాటర్ నిహారిక ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక కనుల పండువగా ముగిసింది. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన మెగా డాటర్, నటి, నిర్మాత నిహారిక కొణిదెలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి అవార్డు అందుకున్న నటీనటుల పట్ల నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
Also Read : Killer : ‘కిల్లర్’ టీజర్ అవుట్.. మల్టీ షేడ్స్ జ్యోతి పూర్వజ్ అరాచకం.. !
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి ఉత్తమ డెబ్యూ (నూతన పరిచయం) అవార్డులు గెలుచుకున్న యంగ్ యాక్టర్లకు స్టేజ్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనిపై నిహారిక స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ఆ ఒక్క నిమిషం వాళ్ళ కల అంటూ ‘ఒక ఆర్టిస్ట్ జీవితంలో డెబ్యూ అవార్డు అనేది మరిచిపోలేని మైలురాయి. ఆ వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడటం వాళ్ళ జీవితకాల కల. కానీ ఆ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని తనకు తెలుసు. కానీ మొదటిసారి అవార్డు అందుకున్న వారికి కనీసం ఒక నిమిషం కేటాయిస్తే అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని నిహారిక పేర్కొన్నారు.
కాగా నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.. ‘కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోతే ఎలా? అంటూ నెటిజన్లు ఫిలింఫేర్ నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మాతగా ఎప్పుడూ చిన్న సినిమాలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిహారిక.. ఈసారి కూడా కొత్త నటీనటుల గొంతుకగా మారి వారి ఆవేదనను ప్రతిబింబించారంటూ సినీ వర్గాలు ఆమెను అభినందిస్తున్నాయి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?