NTV Telugu Site icon

Lok sabha poll results: జూన్ 4 తర్వాత నిఫ్టీ 23 వేల మార్కు దాటనుందా?

Nifty

Nifty

జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయా? మార్కెట్ సూచీలు పరుగులు పెట్టబోతున్నాయా? అంటే సూచనలు అలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అయితే దేశంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారం ఛేజిక్కించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత మే 25న జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ల సూచీలు పరుగులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..

బుధవారం స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ 23,000 మార్కుకు చేరువలో ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మూడోసారి మోడీనే ప్రధాని కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 4 తర్వాత నిఫ్టీ 23 వేల మార్కు దాటడం ఖాయమని నివేదిక అందుతోంది. బుధవారం నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 22,597.8 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇది త్వరలోనే 23 వేల మార్కు దాటడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: RBI Dividend: 2.11 లక్షల కోట్ల డివిడెండ్ కు ఆర్బీఐ ఆమోదం..

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిఫ్టీని 23,000 దాటి పోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ బెర్న్‌స్టెయిన్ తెలిపింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్ సైక్లికల్, ఫైనాన్షియల్‌లు లాభాల్లో పయనించవచ్చని వెల్లడించింది. ఐటీ స్టాక్‌లు మాత్రం వెనుకబడి ఉండవచ్చని బెర్న్‌స్టెయిన్ ఒక నివేదికలో పేర్కొంది. స్మాల్ మరియు మిడ్ క్యాప్స్ కొన్ని రోజులు లార్జ్ క్యాప్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని పేర్కొంది. తాజా పరిణామాలను అంచనా వేసి ఈ నివేదిక రూపొందించినట్లు బెర్న్‌స్టెయిన్ తెలిపింది.

భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. ఆసియా దేశాలను ఇండియా అధిగమిస్తుందని నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలు కల్పించడం, తయారీ రంగాన్ని పోత్సహించడం, ఆచరణీయమైన ఎగుమతి ఫ్రాంచైజీని నిర్మించడం అవసరం అని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ తెలిపింది. ఇక బీజేపీ 330-350 సీట్లు సాధించొచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: Pawan singh: భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ వేటు