Site icon NTV Telugu

Nidhi Agarwal : బ్లాస్టింగ్ పోజులతో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్…

Whatsapp Image 2023 10 04 At 9.20.48 Pm

Whatsapp Image 2023 10 04 At 9.20.48 Pm

నిధి అగర్వాల్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఈ భామకు ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తరువాత రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.నిధి అగర్వాల్ ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలని ఎంచుకుంటోంది. ఇస్మార్ట్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది.అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియడం లేదు.. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఎప్పుడో నిధి అగర్వాల్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.ఏది ఏమైనా నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ దూసుకుపోతుంది అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.నిధి అగర్వాల్ బ్లాస్టింగ్ పోజులతో బరువైన పరువాలతో ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు. థండర్ థైస్, క్లీవేజ్ సొగసుతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ. నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి

Exit mobile version