NTV Telugu Site icon

Most sixes in T20: టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడు.. స్కై, బట్లర్ను వెనక్కి నెట్టి

Pooran

Pooran

టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ నిలిచాడు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రత్యర్థి జట్టుపై తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 26 బంతుల్లో 65 పరుగులతో దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్‌లను వెనక్కి నెట్టి పూరన్ మూడో స్థానానికి ఎగబాకాడు.

Read Also: HYDRA Commissioner: చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశాం..

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. నికోలస్ పూరన్ టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత.. గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వంటి బ్యాట్స్‌మెన్‌లను దాటి వచ్చాడు. కాగా.. మార్టిన్ గప్టిల్ (173), రోహిత్ శర్మ (205) సిక్సర్లతో నికోలస్ పూరన్ కంటే ముందున్నారు. కాగా.. పురాన్ దూకుడు ఇన్నింగ్స్తో దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

Read Also: ICC-BCCI: జైషా ఐసీసీ ఛైర్మన్‌ అయితే.. అతని స్థానంలో వచ్చేదెవరు..?

అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో..
రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ – 122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు
నికోలస్ పూరన్ – 96 మ్యాచ్‌ల్లో 139 సిక్సర్లు
జోస్ బట్లర్ – 124 మ్యాచ్‌ల్లో 137 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ – 71 మ్యాచ్‌ల్లో 136 సిక్సర్లు.