Site icon NTV Telugu

NIA Raids : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Nia Raids

Nia Raids

NIA Raids In More then Ten States in India

దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారు జామునుండి పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యాలయాలు దాని అనుబంధ సంస్థలపై దాడులు ఎన్‌ఐఏ బృందాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో వందమందికి పైగా కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. ఇప్పటికే పలువురు పీఎఫ్‌ఐ కార్యకర్తలను రహస్య ప్రాంతాలకు తరలించి ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

 

ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలోని కర్నూలు ఖడగ్‌పూర్ లో ఎన్ఐఏ సంస్థ సోదాలను నిర్వహిస్తుంది. పీఎఫ్ఐ సంబంధిత నేతల ఇళ్లల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వంద మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మతపరమైన సంస్థల్లో సోదాలను నిర్వహిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్ఐఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

 

Exit mobile version