NIA Raids: ముంబైలో సోదాలు… దావూద్ ఇబ్రహీంతో లింకులపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ ఉన్న వారి ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా ఆరోజు దావూద్ తో సంబంధం ఉందనే ఆరోపణలపై 15 మందిని ఎన్ఐఏ విచారణకు పిలిచింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ లు చేయలేదు.
మనీలాండరింగ్ కేసు, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గతంలో ఎన్సీపీ నేత, ప్రస్తుతం శివసేన సర్కార్ లో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో నవాబ్ మాలిక్ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ అరెస్ట్ రాజకీయంగా జరిగిందనే ఆరోపణలు చేశారు శివసేన, ఎన్సీపీ నేతలు. కావాలనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఎన్సీబీ, ఎన్ఐఏ వంటి సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. నవాబ్ మాలిక్ అరెస్ట్ పై అధికార శివసే, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు, బీజేపీ పార్టీలకు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
ప్రస్తుతం పాకిస్తాన్ కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం తన అనుచరులతో ఇండియాలో మనీలాండరింగ్, ఉగ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడు. కరాచీ నుంచే తన నెట్ వర్క్ ను ఆపరేట్ చేస్తున్నాడు. 1993 ముంబై బ్లాస్ట్ లతో దావూద్ ఇబ్రహీంకు సంబంధాలు ఉన్నాయి. ఈ పేలుళ్లలో ప్రధాన సూత్రధారుడిగా దావూద్ ఇబ్రహీం, డీ కంపెనీ ఉంది. అయితే అప్పటి నుంచి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఏకంగా పాక్ ఆర్మీనే దావూద్ ఇబ్రహీంకు రక్షణ కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!