వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు. ఎన్ఐఏ అధికారులు ఒకే రోజున 35 మంది సాక్ష్యులను విచారించారు.. మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని లాయర్ ఇంకొల్లు వెల్లడించారు.
ఛార్జి షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి కూడా అర్ధమవుతుంది అని ఆయన పేర్కొన్నారు.
Read Also : Cm Jagan : ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ .. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
జగన్ వాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారు. నిందితుడి జన్మభూమి కమిటీ సిఫార్సుతో తానేకంక గ్రామంలో ఇంటి స్థలం తీసుకున్నాడు.. నిందుతుడు శ్రీనును పథకం ప్రకారమే హర్ష వర్ధన్ చౌదరి రెస్టారెంట్ లోకి తీసుకెళ్లారు.. నిందితుడి గ్రామంలోని ఫ్లెక్సీపై సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫోటో ఎందుకు వచ్చింది.. విశాఖ ఎయిర్ పోర్టు అధారిటీ నిందితుడు శ్రీనివాస్ పై కేసు ఉన్నప్పటికీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారో విచారణ జరపాలి అని సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఫుడ్ అండ్ ఫ్యూజన్ అధినేత, టీడీపీ సానుభూతిపరుడు రామకృష్ణను ఎన్ఐఏ విచారించలేదు.. ఎన్ఐఏ మొదటి వేసిన పిటిషన్ తర్వాత ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ కేసులో తదుపరి విచారణ జరపాలని కోర్టును కోరారు అని సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
Read Also : Telugu Indian Idol: ‘నాటు నాటు’ సాంగ్ రాసిన పెన్ను దక్కింది ఎవరికంటే…
సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో తదుపరి దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ పై వాదనాలు జరిగాయి. 1-1-2019 నాడు ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. సాక్షులను విచారించింది. తన విచారణ సమయంలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా విషయాన్ని ఎన్ఐఏ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ విషయాలపై ఎలాంటి విచారణ జరుపకుండానే.. 23-01-2019 ఛార్జీషీట్ దాఖలు చేశారు. మరోవైపు లోకల్ పోలీసులు 10-05-2019న దాడికి ఉపయోగించిన వస్తువులు అప్పగించారు. దాడి జరిగిన ఆరు నెలల తర్వాత ఈ పని చేశారు. ఇలా ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని లాయర్ వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా ఎన్ఐఏ దార్యప్తు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను 20వ తేదికి కోర్టు వాయిదా వేసింది.