Nizamabad PFI Case: PFI కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI నిజామాబాద్ కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు చేర్చుకోవడం.. తీవ్రవాదం చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై నొస్సామ్ మహ్మద్ యూనస్‌పై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. దీంతో.. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 17కి చేరింది. 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే PFI కుట్రను కొనసాగించడానికి హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే PFI లో నొస్సమ్ మహమ్మద్ చేరాడని NIA ఛార్జ్ షీట్ లో చేర్చారు.
Pawan Kalyan: నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతా..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అంతేకాకుండా.. ముస్లిం యువతను ప్రేరేపించడం, అమాయకులను రిక్రూట్ చేసుకోవడంలో నిందితుడు ప్రమేయం ఉందని పేర్కొంది. ప్రత్యేకంగా రహస్యంగా నిర్వహించే పీఎఫ్ఐ ఆయుధ శిక్షణా శిబిరాల్లో వారికి ఆయుధ శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. గొంతు, కడుపు, తల మొదలైన వారి ముఖ్యమైన శరీర భాగాలపై దాడి చేయడం ద్వారా వారి ‘లక్ష్యాలను’ చంపడానికి మారణాయుధాలను ఉపయోగించడంలో ఇతను శిక్షణ ఇచ్చాడు. దేశంలోని వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం కోసం కుట్రను గుర్తించినట్లు NIA తెలిపింది.
Lok Sabha: “సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
ఈ కేసును 2022 జూలైలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని VI టౌన్ పోలీసులు FIR నంబర్ 141/2022గా నమోదు చేశారు. NIA ఆగస్టు 2022లో తెలంగాణ పోలీసుల నుండి దర్యాప్తును స్వీకరించింది. ఈ క్రమంలో.. 11 మంది నిందితులపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. డిసెంబర్ 2022, 2023 మార్చిలో ఐదుగురు నిందితులపై రెండవ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సెప్టెంబరు 2022 నుంచి NIA విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!