Rishabh Pant: జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. పంత్‌ను కలిసిన తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్ ఇచ్చింది. క్రికెటర్ పంత్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో గుంతలు లేవని జాతీయ రహదారుల శాఖ రూర్కీ డివిజన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రదీప్ సింగ్ గుసైన్ తెలిపారు. కారు ప్రమాదానికి గురైన చోట రాజ్‌వాహ్ నది ఉన్నందున రోడ్డు కొంచెం ఇరుకుగా ఉందన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గుంతకు మరమ్మతులు చేసి పూడ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. జాతీయ రహదారిపై మరమ్మతులు చేస్తున్నట్లు కొన్ని చిత్రాలు వైరల్ కావడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.
Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మరోవైపు పంత్‌ను పరామర్శించిన ఢిల్లీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ శ్యామ్‌శర్మ కూడా ప్రమాదానికి కారణం రోడ్డుపై గుంతే అని పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై హరిద్వార్ ఎస్పీ ఎస్కే సింగ్ మాత్రం.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ ముందు రిషబ్ పంత్ నిద్రమత్తులోకి జారుకున్నాడని వెల్లడించారు
