NTV Telugu Site icon

New Zealand Youngest MP: మాతృభాష కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను..

New Zeland Mp

New Zeland Mp

Youngest MP: న్యూజిలాండ్ 170 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలు అయిన సాల్ ఎంపీ హనా-రౌహితి-మాపి-క్లార్క్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం.. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను రక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతుంది.

Read Also: Costly Bag : ఈ బుజ్జి బ్యాగ్ ధర తెలిస్తే ఫ్యూజులు అవుటే.. అన్ని కోట్లా?

అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ హనా రౌహితి పార్లమెంటులో ప్రసంగం చేస్తూ.. మావోరీ భాషలో “మీ కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడంతో పాటు మీ ప్రాణాలను రక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొనింది. మావోరీ తెగకు చెందిన విద్యార్థులు తమ భాషలో చదువుకునే అవకాశం రాకపోవడంతో వారు అభివృద్ధి చెందడం లేదని వాపోయారు. ఇకపై మాతృభాష నేర్చుకోవడానికి మావోలు బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.. మావోరీ భాషలో హనా ప్రసంగానికి నెట్టింట భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లతో వైరల్‌గా మారింది.

Read Also: Sai Dharam Tej: పవన్ కల్యాణ్‌తో లెగో బాండింగ్.. అలాంటి సినిమాలే చేస్తాను..

ఇక, 21 ఏళ్ల ఈ యువ ఎంపీ ఆక్లాండ్- హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణంలో నివసిస్తుంది. అక్కడ ఆమె మావోరీ కమ్యూనిటీ గార్డెన్‌లో స్థానిక కమ్యూనిటీ పిల్లలకు గార్డెన్ గా ఉన్నారు. హనా మావోరీ గిరిజన హక్కుల సంస్థ నాగ టమాటాలో కూడా సభ్యురాలుగా ఉంది. హనా తనను తాను రాజకీయ నాయకురాలిగా కాకుండా మావోరీ భాషకు రక్షకురాలిగా భావిస్తుంది.. కొత్త తరం మావోరీల గొంతును ప్రపంచ వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని యువ ఎంపీ హనా రౌహితి పేర్కొనింది.