NTV Telugu Site icon

New Zealand Ex PM: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని

Ex Pm

Ex Pm

Jacinda Ardern: న్యూజిలాండ్ మాజీ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదు సంత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంది. చాలా కాలం నుంచి జీవిత భాగ‌స్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె మ్యారేజ్ చేసుకుంది. క‌రోనా వైర‌స్ టైంలో న్యూజిలాండ్‌లో అతి క‌ఠిన‌మైన ఆంక్షలను జెసిండా విధించారు.. త‌న పెళ్లిని కూడా క‌రోనా వ‌ల్లే ఆమె వాయిదా వేసుకుంది. వెల్లింగ్టన్ కు 325 కిలో మీటర్ల దూరంలో ఉన్న హాక్ బే ఏరియాలో ఉన్న ఓ విలాసవంతమైన తోటలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

Read Also: Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..

అయితే, పెళ్లి వేళ కొంద‌రు నిరసనకారులు వేదిక బయటవ వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా పోస్టర్లతో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2014 నుంచి జెసిండా ఆర్డెర్న్, గేఫోర్డ్ డేటింగ్‌లో ఉన్నారు. ఇక, ఐదేళ్ల త‌ర్వాత వాళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. కానీ, కరోనా ఆంక్షల వల్ల 2022లో వాళ్ల పెళ్లికి అవాంత‌రాలు వచ్చాయి. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత 2018లో ఆమె ఓ పాప‌కు జన్మనిచ్చి తల్లి కూడా అయింది. న్యూయార్క్‌లో జ‌రిగిన యూఎన్ మీటింగ్‌కు కూడా ఆ పాప‌ను జెసిండా తీసుకెళ్లారు. అయితే, 2023 జ‌న‌వ‌రిలో ఆమె అక‌స్మాత్తుగా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జెసిండా ఆర్డార్న్, క్లార్క్ గేఫోర్డ్‌ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.