Site icon NTV Telugu

NZ vs AFG: అర్ధ సెంచరీతో చెలరేగిన సీఫెర్ట్.. 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌పై న్యూజిలాండ్‌ గెలుపు

Nz Vs Afg

Nz Vs Afg

ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి, సీఫెర్ట్ అర్ధ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సీఫెర్ట్ 65 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ, డారిల్ మిల్లిచ్, కెప్టెన్ సాంట్నర్ కలిసి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.

Also Read:China Sea Corridor: 28 కి.మీల సముద్ర కారిడార్ నిర్మాణం.. 2 గంటల ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లోనే..

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 27 పరుగులు చేయగా, ఇబ్రహీం జద్రాన్ 10 పరుగులు చేశాడు. సాదిఖుల్లా అటల్ 29 పరుగులకు అవుటయ్యాడు. గుల్బాదిన్ నయీబ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి 63 పరుగులకు ఔటయ్యాడు. రసూలి 13 బంతుల్లో 20 పరుగులు చేయగా, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యాడు, నబీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టగా, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Also Read:Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఒక పరుగుకే వికెట్ కోల్పోగా, రచిన్ రవీంద్ర ఖాతా కూడా తెరవలేకపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 42 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సీఫెర్ట్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి 65 పరుగులు చేసి ఔటయ్యాడు. చాప్మన్ 28 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత డారిల్ మిచెల్ 25 పరుగులు, సాంట్నర్ 17 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, ఒమర్జాయ్, మహ్మద్ నబీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Exit mobile version