ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Read Also: Crime: ఎన్నారై మహిళ మృతి కేసులో కొనసాగుతున్న మిస్టరీ!
భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్:
విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్/బ్యాటర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విల్ ఓ’రూర్కే, నాథన్ స్మిత్.