NTV Telugu Site icon

IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!

New Zealand Squad Test

New Zealand Squad Test

New Zealand Test Squad For India: ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. అక్టోబర్ 12న చివరి టీ20 జరగనుంది. ఇక సొంతగడ్డపై అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో రోహిత్ సేన టెస్టు సిరీస్‌ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొసం న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ జట్టు త్వరలోనే భారత్ చేరుకోనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది.

స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా భారత్‌తో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో కేన్ మామ గజ్జల్లో గాయం అయింది. రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం పునరావాసం పొందుతున్న కేన్.. భారత్‌కు ఆలస్యంగా రానున్నాడు. అతడి స్థానములో మార్క్ చాప్‌మన్‌ను (మొదటి టెస్టు కోసం) ఎంపిక చేశారు. మైఖేల్ బ్రేస్‌వెల్ మొదటి టెస్ట్ ఆడిన అనంతరం స్వదేశం వెళ్లిపోనున్నాడు. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అతని స్థానంలో ఇష్ సోధిని సెలెక్ట్ చేశారు.

న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

Show comments