NTV Telugu Site icon

Air Pollution: వాయు కాలుష్యంతో విలవిలలాడుతున్న న్యూయార్క్ వాసులు

New York

New York

Air Pollution: న్యూయార్క్ నగరం దట్టమైన పొగతో కమ్ముకుని ఉంది. మంగళవారం అక్కడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు నగరం మొత్తం దట్టమైన పొగతో కప్పేసింది. న్యూయార్క్ నగరం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణమేంటంటే.. కెనడాలో కార్చిచ్చు ప్రభావంగా నగరం మొత్తం ఈ పరిస్థితికి దారితీసింది. కాలుష్యం ఎంతుందని కొలువగా.. యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 222ను తాకింది. ఇంత పెద్ద మొత్తంలో ఉండటమనేది ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయి అని అర్థం. ఇండియాలోని ఢిల్లీ, ఇరాక్ లోని బాగ్ధాద్ తదితర నగరాల కంటే న్యూయార్క్ లో అధిక కాలుష్య స్థాయి కనిపించింది.

Read Also: Custody: అక్కినేని కుర్రాడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు…

న్యూయార్క్‌తో పాటు ఇత‌ర అమెరికా న‌గ‌రాలు పొగతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు డెట్రాయిట్ న‌గ‌రంలో కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. న్యూయార్క్‌లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నేప‌థ్యంలో న‌గ‌ర ప్రజ‌ల‌కు హెచ్చరికలు జారీ చేశారురు. బయటుకు వెళ్లే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలంటూ సూచించారు. మంగ‌ళ‌వారం రాత్రి 1.05 నిమిషాల స‌మ‌యంలో న్యూయార్క్‌లో కాలుష్య ఇండెక్స్ 0-500 మ‌ధ్య ఉన్నట్లు తేల్చారు. గాలి నాణ్యత మ‌రీ మ‌రీ అనారోగ్యక‌రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also: AP Cabinet : పది పాసైన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కెనడాలో కార్చిచ్చు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. చాలా వేగంగా అడవులు అంటుకుంటున్నాయి. ఇప్పటి వరకు కెనడా అడవుల్లో 8.2 మిలియన్ ఎకరాల పరిధిలో చెట్లు తగలబడినట్టు సమాచారం. 26,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 413 చోట్ల కార్చిచ్చు ఘ‌ట‌న‌లు న‌మోదు అయ్యాయి. ఇంకా ఈ కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది.