NTV Telugu Site icon

Hyderabad Metro: నగర వాసులకు గుడ్ న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

Metro

Metro

ఆంగ్ల నూతన సంవత్సరాది మరికొన్ని గంటల్లో రానుంది. ఈ క్రమంలో ప్రపంచమంతా వేడుకలకు సిద్ధం అవుతుంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రేపు డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా రాత్రి 12.30 వరకు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్లో చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

Read Also: Pawan Kalyan: OG OG అని అరుస్తుంటే బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అర్ధరాత్రి వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్ గా ఇంటికి చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ క్రమంలో.. ప్రయాణికులు మెట్రో రైల్‌లో సేవ్ జర్నీ చేయాలని మెట్రో ఎండీ సూచించారు. మెట్రో రైల్ సేవలను ప్రత్యేక అకేషన్ పండుగలు టైంలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపారు. మద్యం తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులంతా బాధ్యతాయుతంగా వ్యవహారించాలని మెట్రో ఎండీ సూచించారు.

Read Also: Satya Nadella: అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగ‌స్వామిగా ఉంటాం..

Show comments