Site icon NTV Telugu

New Year 2023: ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు.. కొత్త ఏడాదికి న్యూజిలాండ్ స్వాగతం

New Year

New Year

New Year 2023: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2022కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2023కి స్వాగతం పలికారు. వీరితోపాటు పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకల సందడికి శ్రీకారం చుట్టారు.

Rishabh Pant: రిషబ్ పంత్‌ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్‌ సర్జరీ చేసిన వైద్యులు

న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. మరోవైపు.. భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు. జపాన్ సైతం మనకంటే మూడు గంటలు ముందే 2023లోకి అడుగుపెట్టనుంది. ఇదే సమయంలో న్యూజిలాండ్ ఛాధమ్ దీవులు, రాజధాని ఆక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కాల్చి సందడి చేశారు. పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ అక్లాండ్ వాసులు ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇలా వరుసగా ప్రపంచంలోనే తొలుత ఆక్లాండ్‌లో కొత్త ఏడాది 2023 వచ్చింది.

Exit mobile version