NTV Telugu Site icon

New Year 2024: వామ్మో.. హైదరాబాదీలు అన్ని లక్షల కేజీల చికెన్ ను కుమ్మేశారా?

Chicken

Chicken

డిసెంబర్ 31 అంటే హంగామా మాములుగా ఉండదు.. ఆట, పాట మందు, విందు అబ్బో ఒక్కటేమిటి కొత్త ఏడాది కోసం చేసే హడావిడి మాములుగా ఉండదు.. విందు అంటే నాన్ వెజ్.. ఎక్కువగా ఇష్టపడేది చికెన్ ను.. ముక్కతో పాటు మందు సుక్క ఇక్కడ మస్ట్ గా మారింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చికెన్, మటన్, చేపల షాపుల్లో రద్దీ కనిపించింది… గతంలో ఎప్పుడూ తినలేదేమో అన్నట్లు కేజిలు కేజిల మాంసాన్ని విక్రయించినట్లు తెలుస్తుంది..

భాగ్యనగరంలో సాధారణ రోజుల్లో కంటే ఆదివారం ఒక్కరోజే మటన్, చికెన్, చేపల విక్రయాలు భారీగా పెరిగియి. ఆదివారం భారీగా నాన్ వెజ్ తిన్నారు. హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​ విక్రయించగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడు పోయింది… కార్తీక మాసం తర్వాత చికెన్, గుడ్లు ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం రూ.250 వరకు ఉన్నట్లు తెలుస్తుంది..

నిన్న ఒక్క రోజే రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ కూడా భారీగానే అమ్ముడు పోయింది. దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. మటన్ ​ధర ప్రస్తుతం రిటైల్​మార్కెట్​లో కిలో రూ. 800 నుంచి రూ. 900 వరకు పలుకుతున్నాకొనుగోలు చేస్తున్నారు.. ఇక న్యూయర్ రోజు కూడా అమ్మకాలు తగ్గలేదని తెలుస్తుంది.. ఇప్పటివరకు 5.3 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. 7 లక్షల కిలోల వరకు చికెన్ అమ్ముడు పోతుందని అంచనా వేస్తున్నారు.. ఎందులోనూ హైదరాబాదీలు తగ్గేదేలే అని మరోసారి నిరూపించారు..