NTV Telugu Site icon

Vizag Fake IAS: నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్!

Vizag Fake Ias

Vizag Fake Ias

విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు రూపాయలు కాజేశారు. ఇళ్లులు ఎక్కడ అని అడిగితే తిరిగి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు.

జీవీఎంసీ కమిషనర్‌గా పని చేస్తున్నా అంటూ మన్నెందొర చంద్రశేఖర్‌ నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకొని దందా కొనసాగించాడు. హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నానని అమృత మోసాలకు పాల్పడింది. ఈ నకీలి ఐఏఎస్ జంట అద్దెకు ఉంటున్న ఇంటిని సైతం కబ్జా చేసి.. బెదిరించి ఆక్రమించుకుంది. ఇద్దరిపై ఎంవీపీ, కంచరపాలెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. పారిపోతున్న ఈ జంటను ప్రకాశం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. నకీలి ఐఏఎస్ జంట బాధితులు ఎవరు ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని విశాఖ సీపీ కోరారు. ఫేక్ ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్‌కు తరలించారు.