NTV Telugu Site icon

Radha Murder Case: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. సినిమాను తలపించేలా..!

Radha Murder Case

Radha Murder Case

Radha Murder Case: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన సాప్ట్‌వేర్ ఉద్యోగి రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. సినిమాను తలపించే ట్విస్ట్‌ వెలుగు చూసింది. కారుతో తొక్కించి.. బండరాళ్లతో కొట్టి.. సిగరేట్లతో కాల్చి దారుణంగా హత్య చేసిన ఈ కేసు మలుపు తిరిగింది. హత్య చేసి తప్పించుకోవాలని.. అనుమానం రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.భర్తే ఆమెను అత్యంత దారుణంగా చంపినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన రాధ అనే వివాహితను ఈనెల 17న గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఈమె భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా ఉంటున్నారు. అయితే డబ్బుల విషయంలో భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. అది విడిపోయే వరకు వెళ్లింది.

Read Also: Karnataka: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు వరాల జల్లు

గతంలో రాధ సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లోనే పనిచేసేది. తన స్నేహితుడైన కాశిరెడ్డిని నమ్మి దాదాపు 80 లక్షలు అప్పు ఇచ్చింది. కాశిరెడ్డి బెట్టింగుల్లో మొత్తం డబ్బులు పోగొట్టుకుని ఐపీ పెట్టేసి చెక్కేశాడు. దీంతో అప్పటి నుంచి భార్యా భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఊళ్లో జాతరకు వచ్చిన ఆమె… కాశిరెడ్డి నుంచి డబ్బులు తెస్తానని వెళ్లింది. తర్వాత రెడ్‌ కలర్‌ కారులో ఆమె వెళ్లినట్టు గుర్తించారు. సీన్‌ కట్‌ చేస్తే జిల్లెళ్లపాడు సమీపంలో ఆమె డెడ్‌బాడీ దొరికింది. తర్వాత బాడీని భర్త స్వస్థలం కోదాడ తీసుకెళ్లి ఖననం చేయడం… తర్వాత కార్యక్రమాలు జరిగాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రాధను ఎవరు చంపారు..? డబ్బు ఇస్తానని నమ్మించి కాశిరెడ్డే ప్రాణం తీశాడా..? లేక భర్త ప్రమేయం ఉందా..? ఇంకా ఎవరైనా చంపేశారా అనే కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు సాగింది.. ఇటు కాశిరెడ్డి స్నేహితుల్ని ప్రశ్నిస్తూనే… అటు భర్త మోహన్‌రెడ్డిని కూడా ఎంక్వయిరీ చేశారు.

Read Also: Astrology : మే 21, ఆదివారం దినఫలాలు

భార్య చనిపోయినట్టు ముందు రోజు రాత్రి సమాచారం ఇస్తే మర్నాడు మధ్యాహ్నానికి గానీ భర్త రాలేదు. ఆలస్యంగా అనుమానించిన పోలీసులు ఆరోజు ఎక్కడున్నాడని మొబైల్‌ లొకేషన్‌ ట్రేస్‌ చేశారు. కోదాడ వెళ్లిన ప్రత్యేక టీమ్‌ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరకు ఖాకీ మార్క్‌ ట్రీట్మెంట్‌తో నిజం కక్కాడు. డబ్బు విషయమే కాకుండా… వివాహేతర సంబంధం అనుమానంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. చివరకు ఎలాగైనా అడ్డు తొలగించాలనుకుని పక్కా స్కెచ్‌ గీశాడు. డబ్బు కోసం వెళ్తున్న భార్యను కారులో ఫాలో అవుతూ వచ్చిన మోహన్‌ రెడ్డి…. తర్వాత ఆమెకు సర్దిచెప్పి ఎక్కించుకున్నాడు. కనిగిరి శివార్లలోకి వెళ్లగానే చున్నీ మెడకు బిగించి చంపేశాడు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశాడు. మరోవైపు రాధ పేరు మీద ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్‌ డబ్బు కోసమే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో మొదట కేసు దర్యాప్తు.. అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్‌రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.