NTV Telugu Site icon

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్

Ntr 100 Rupees

Ntr 100 Rupees

NTR 100 Rupees Coin: టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) స్మారకార్థం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కార్యక్రమ అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి.. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్‌తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి.. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.. కాగా, ఎన్టీఆర్ చిత్రం ఉన్న వంద రూపాయల నాణెంను ఈ నెల 28న విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయలు నాణాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొనగా.. ఇప్పుడు లక్ష్మీ పార్వతితో లేఖతో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరినట్టు అయ్యింది.

కాగా, ఎన్టీఆర్‌ చిత్రంతో రూపొందించిన ఆ వంద రూపాయల కాయిన్‌ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండనుంది.. ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగీ, ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పికే పేర్కొన్న విషయం విదితమే.. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉండనుండగా… మరోవైపు ఎన్టీఆర్ చిత్రం.. దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇది హిందీలో రాయబడి ఉంటుంది ఇప్పటికే ఆర్బీఐ పేర్కొన్న విషయం విదితమే.

 

Show comments