NTV Telugu Site icon

Thirumla Road: కొండపైకి ఆ సమయంలో బైక్స్‌కు నో ఎంట్రీ.. జాగ్రత్త సుమీ..

Ttd

Ttd

Thirumla Road: మరోసారి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత రెండు నెలల నుంచి తిరుమలలో చిరుతలు తిరుగుతూ కలకలం రేపిన సంఘటనలు చాలానే చూసాము. అయితే జంతువులు బ్రీడింగ్ సమయం కావడంతో.. తరచూ నడక మార్గాన్ని., అలాగే మొదటి ఘాట్ రోడ్డు దాటుతూ భక్తుల్లో చిరుతలు భయాన్ని కలిగిస్తున్నాయి.

Harish Rao: కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది..

ఈ నేపథ్యంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్న ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేటి నుంచే అంటే ఆగస్టు 12 సోమవారం నుండి అమల్లోకి రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. మామూలుగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుండి రాత్రి పది గంటల వరకు ద్విచక్ర వాహన రాగబోకులకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని కాస్త టీటీడీ తెలిపింది. ఆదివారం నాడు రాత్రి 9 గంటల సమయంలో 54వ క్రాస్ వద్ద చిరుత కనిపించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show comments