NTV Telugu Site icon

New Rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి పూర్తి చేశారా లేదంటే అంతే..!

New Rules

New Rules

జూన్​1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ పనులకు గడువు తేదీలు కూడా జూన్​లోనే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది! పాన్ ఆధార్ లింకింగ్, ఈపీఎఫ్ అధిక పింఛను, ఉచిత ఆధార్​ అప్డేట్​కు సంబంధించిన పలు గడువు తేదీలు జూన్​లోనే ఉన్నాయి. జూన్‌లో రానున్న కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.

Read Also: YSR Pension: జూన్ 1న వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం

పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే అనేకసార్లు గడువు పొడిగించింది. చివరిసారిగా మార్చి 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను జూన్ 30 వరకు పొడిగించింది. ఆధార్ పాన్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ).. చందాదారుల అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకొనే గడువును జూన్‌ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ కావాలనుకునే వారు.. జూన్ 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Read Also: Increased Prices Pulses: నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

మరోవైపు ఉచితంగా ఆధార్​అప్డేట్ చేసుకునే ప్రక్రియ.. మరికొన్ని రోజులే ఉంది. దీనిపై ఇటీవలే యూఐడీఏఐ ట్వీట్ చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 14వ తేదీ వరకు మాత్రమే ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. FAME-2 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత పెట్టబోతున్నట్లు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దీంతో వాటి ధరలు.. జూన్​ ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. సవరించిన సబ్సిడీ రేటు జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు వర్తిస్తుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Show comments