Site icon NTV Telugu

Madrasa: ఉగ్రదాడుల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మదర్సాలకు కొత్త నిబంధనలు..

Madrasa

Madrasa

భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉంచడానికి, యోగి ప్రభుత్వం కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రంలోని మదర్సాలలో అభ్యసించే విద్యార్థులు, మౌలానాల పూర్తి వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ATS)కి సమర్పించాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడుల తర్వాత అనేక రాష్ట్రాల్లోని భద్రతా సంస్థలు తమ దర్యాప్తును విస్తరిస్తున్న సమయంలో ఈ చర్య తీసుకుంది.

Also Read:Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి

కొత్త ఉత్తర్వు ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని మదర్సా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మత బోధకుల వ్యక్తిగత నేపథ్యం, ​​మొబైల్ నంబర్, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ఇతర గుర్తింపు పత్రాలను ATS కార్యాలయానికి అందించాలి. అదేవిధంగా, మదర్సాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, మొబైల్ నంబర్‌లను జాబితా చేసి సమర్పించడం తప్పనిసరి. ఈ ప్రక్రియ కేవలం డేటా సేకరణ లేదా సర్వే మాత్రమే కాదు, ఏదైనా సంస్థలోని అనుమానాస్పద అంశాలను సకాలంలో గుర్తించడానికి భద్రతా ఆడిట్‌లో భాగమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా కొన్ని మదర్సాలు, ప్రైవేట్ మతపరమైన సంస్థలలోకి బయటి రాష్ట్రాల నుంచి యువత రాకపోకలు పెరుగుతున్నాయని నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయని వర్గాలు తెలిపాయి. దీనికి ప్రతిస్పందనగా, మదర్సాల సమగ్ర బ్యాగ్రౌండ్ ధృవీకరణను నిర్వహించే బాధ్యత ATSకి అప్పగించింది ప్రభుత్వం.

Also Read:Humane Sagar: బ్రేకింగ్: మేనేజర్ బలవంతం.. స్టార్ సింగర్ మృతి

ఇటీవలి ఢిల్లీ బాంబు దాడుల తర్వాత, జాతీయ భద్రతా సంస్థలను హై అలర్ట్‌లో ఉంచారు. మతపరమైన, విద్యా సంస్థలకు విజిటర్స్ గుర్తింపులను క్రాస్-చెకింగ్ చేయాలని కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర స్థాయి బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో, ఉత్తరప్రదేశ్ ATS మదర్సాల నుండి వివరణాత్మక సమాచారాన్ని కోరే ప్రక్రియను ప్రారంభించింది. మదర్సాలు మాత్రమే కాదు, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఢిల్లీ బాంబు దాడుల దర్యాప్తు సమయంలో లక్నోలోని ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుడు పర్వేజ్ అన్సారీ పేరు వెలుగులోకి రావడంతో ఆ విశ్వవిద్యాలయం పరిశీలనలోకి వచ్చింది. తదనంతరం, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రొఫెసర్ల గుర్తింపులు, పత్రాలను అందించాలని నిఘా సంస్థలు విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ ను ఆదేశించాయి. విశ్వవిద్యాలయంలో చదువుతున్న జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల రికార్డులు సమర్పించారు. విదేశీ విద్యార్థుల సంఖ్య, వారి కోర్సులు, వారి వివరాలను కూడా నిఘా విభాగానికి సమర్పించారు.

Exit mobile version