NTV Telugu Site icon

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో సరికొత్త నిబంధనలు..

Ipl Rules

Ipl Rules

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ మధ్య జరుగనుంది. అందుకోసం ఫ్యాన్స్ ఇప్పటికే.. చెన్నై చెపాక్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్మార్ట్ రీప్లే..
ఈ ఐపీఎల్ లో బీసీసీఐ కొత్త టెక్నాలజీ అమలు చేయనుంది. అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత కచ్చితత్వం, వేగం పెంచేందుకు ఈ సీజన్ నుంచి స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు చేయనుంది బీసీసీఐ.
అంటే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉండే గదిలోనే ఉంటారు. ఫీల్డ్ అంతటా ఉన్న 8 హాక్ ఐ స్పీడ్ కెమేరాల నుంచి వచ్చే ఫుటేజ్‌ను తక్షణం అందిస్తారు

2. రెండు బౌన్సర్లు..
ఈ సీజన్ లో బౌలర్ ఒక ఓవర్‌ లో రెండు బౌన్సర్ల వరకూ వేసేందుకు అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకూ ఒక ఓవర్ లో ఒకే బౌన్సర్ అవకాశముండేది. ఓవర్‌కు రెండు బౌన్సర్ల నిబంధనను ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రూల్ ఐపీఎల్‌లో ఉంటుంది.

3. నో స్టాప్..
నో స్టాప్ క్లాక్.. అంటే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లకు మించి గ్యాప్ ఉండకూడదు. దీనికోసం స్టాప్ క్లాక్ ఉపయోగిస్తారు. వాస్తవానికి ఐసీసీ త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు స్టాప్ క్లాక్ రూల్ ప్రవేశపెడుతోంది. ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు స్టాప్ క్లాక్ రూల్ బ్రేక్ చేస్తే బౌలింగ్ టీమ్‌కు 5 పరుగులు పెనాల్టీతో బ్యాటింగ్ టీమ్‌కు జత చేస్తారు.

4. స్టంపింగ్ క్యాచ్ చెక్..
స్టంపింగ్ క్యాచ్ చెక్.. అంటే స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థిస్తే క్యాచ్ చెక్ చేయనున్నారు. వాస్తవానికి ఈ రూల్ ఐసీసీలో లేదు కానీ… ఐపీఎల్‌లో బీసీసీఐ అమలు చేయనుంది.