NTV Telugu Site icon

New Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కొత్త రేషన్‌ కార్డులకు కేబినెట్‌ ఆమోదం

Ration Cards

Ration Cards

గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్‌ సబ్‌ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్‌ , దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెటర్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా.. జాబ్‌ క్యాలెండర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

Amrapali: నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ