NTV Telugu Site icon

New Movies Release: ఒకేరోజు 4 సినిమాలు రిలీజ్.. మరి మీ ఛాయిస్.?

Movies

Movies

New Movies Release on August 15: ఆగష్టు 15న ప్రేక్షకుల ముందరకు థియేటర్లలో 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ 4 సినిమాలపై ప్రేక్షకులే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో ప్లాన్ చేసేసుకున్నారా..?

ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే.. బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ ను వాడుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ హీరోగా చేసిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. కానీ., తెలుగులో ఈ సినిమాను హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ హంగులతో తెరకెక్కించినట్టు సమాచారం. మరోవైపు రవితేజకు చెప్పుకో తగ్గ బారి విజయాలు ఈ మధ్య లేకున్నా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ సినిమాకి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా హిట్ సాధించాలంటే రూ. 32 కోట్లు రాబడితే చాలు.

గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకి రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ. 49 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమా విజయం దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు, మరోవైపు హీరోగా రామ్ పోతినేనికి కీలకం అనే చెప్పాలి.

పా.రంజిత్ దర్శకుడుగా రూపొందించిన విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ సినిమా ‘తంగలాన్‌‌‌‌‌‌‌‌’. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు లు హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తెలుగులో ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. బ్రిటీష్ వారి కాలంలో .. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో, కొండజాతి ప్రాంతానికి చెందిన గిరిజనుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి రాబోతున లేటెస్ట్ సినిమా ‘ఆయ్’. మ్యాడ్ సినిమాతో మెప్పించిన ఈ యంగ్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇక ఈ సినిమాతో అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గోదావ‌రి బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కింది.

Show comments