New Labour Codes 2026 India: హడావిడిగా అమల్లోకి కొత్త చట్టం..! తగ్గిపోనున్న టేక్ హోం శాలరీ.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Labour Codes 2026 India: దేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలికే కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావడంతో ఉద్యోగుల జీతభత్యాలు, పని విధానాలు, సామాజిక భద్రత వంటి అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, పీఎఫ్ పెరగడం వల్ల చేతికి అందే జీతం తగ్గే అవకాశం ఉందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు ప్రధాన కోడ్లను ప్రవేశపెట్టింది. ఇవి వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య కోడ్ 2020.. ఇవి ఉద్యోగుల జీత నిర్మాణం నుంచి పని పరిస్థితుల వరకు అనేక అంశాలను ప్రభావితం చేయనున్నాయి. కొత్త చట్టం ప్రకారం జీతాల నిర్మాణంలో పెద్ద మార్పు ఉంటుంది. మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ప్రాథమిక జీతంగా ఉండాలి. ఇప్పటివరకు చాలా కంపెనీలు అలవెన్సులను పెంచి బేసిక్ పేను తక్కువగా ఉంచేవి. కానీ ఇకపై అలవెన్సులు 50 శాతాన్ని మించకూడదు. దీంతో బేసిక్ పే పెరుగుతుంది. దీని ప్రభావంగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అయితే, ఈ మార్పుల వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది.
Also Read
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
ఇకపై ఉద్యోగులకు నియామక పత్రం ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. అలాగే జీతాలు సకాలంలో చెల్లించడం చట్టబద్ధం కానుంది. దేశవ్యాప్తంగా కనీస వేతన విధానం అమల్లోకి రావడం వల్ల తక్కువ జీతాల సమస్య తగ్గే అవకాశం ఉంది. గ్రాట్యుటీ విషయంలో కూడా పెద్ద మార్పు రానుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సేవ తర్వాత మాత్రమే గ్రాట్యుటీ లభించేది. కానీ కొత్త చట్టం ప్రకారం కేవలం ఒక సంవత్సరం సేవ చేసిన తర్వాతే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రైవేట్ ఉద్యోగులకు ముఖ్యంగా ఉపశమనం కలిగించే అంశం. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ ప్రయోజనాలను పొందగలరు.
మహిళల కోసం కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించబడతారు. అయితే భద్రతా చర్యలు తీసుకోవడం, వారి సమ్మతి తప్పనిసరి. సమాన వేతనం, గౌరవం కూడా ఈ చట్టం హామీ ఇస్తుంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా సమాన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. పని గంటల విషయంలో, వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితి ఉంటుంది. రోజుకు 8 గంటల పని ప్రామాణికంగా పరిగణించబడుతుంది. అదనపు పని చేసినప్పుడు ఓవర్‌టైమ్‌కు రెట్టింపు వేతనం చెల్లించాలి. ఈ నిబంధనలు తయారీ, ఐటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కీలకంగా మారనున్నాయి.
గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లకు కూడా ఈ చట్టం ఉపశమనం కలిగిస్తుంది. వారికి మొదటిసారిగా చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. పీఎఫ్, బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. అగ్రిగేటర్ కంపెనీలు తమ టర్నోవర్‌లో కొంత శాతం ఈ ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి, కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగుల భద్రత, హక్కులు, సామాజిక రక్షణను పెంచే దిశగా రూపొందించబడ్డాయి. అయితే జీతాల నిర్మాణంలో మార్పుల వల్ల తక్షణ ప్రభావంగా టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో మాత్రం పీఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాల రూపంలో ఉద్యోగులకు లాభాలు కలగనున్నాయి.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!