Site icon NTV Telugu

డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్ లైనప్‌లో భారీ మార్పులు.. డిసెంబర్ 10న కొత్త తరం Kia Seltos వచ్చేస్తుంది..!

Kai Seltos

Kai Seltos

Kia Seltos: కియా మోటార్స్ భారత మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన SUV అయిన సెల్టోస్‌ను పూర్తిస్థాయి మోడల్ మార్పుతో కొత్త తరహాలో తీసుకురాబోతోంది. డిసెంబర్ 10న భారత్‌తో పాటు గ్లోబల్‌గా కూడా కొత్త తరం కియా సెల్టోస్ (Kia Seltos‌)ను లాంచ్ చేయనుంది. ఇది 2019లో విడుదలైన మొదటి జనరేషన్ సెల్టోస్‌కు వచ్చిన మెజర్ అప్‌డేట్ అవుతుంది. రాబోయే కొత్త తరం సెల్టోస్ రూపంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుభాగంలో బాక్సీ రూపంలో ఉన్న పెద్ద గ్రిల్, నిలువుగా అమర్చిన LED డేలైట్ రన్నింగ్ ల్యాంప్స్ మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. SUV మొత్తం చూస్తే మరింత స్క్వేర్‌డ్ ఆఫ్, స్ట్రాంగ్ స్టాన్స్‌తో కనిపించేలా డిజైన్ మార్చారు. బంపర్ రూపకల్పన, అల్‍య్ వీల్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ అయ్యాయి. వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, రీస్టైల్‌డ్ టెయిల్‌గేట్ కవరింగ్ SUVకి నూతన తరాన్ని సూచించే విధంగా ఉన్నాయి.

Prompt Injection Threat: ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం..!

అలాగే ఇంటీరియర్ కూడా కొత్త లుక్‌తో రానుంది. డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పూర్తిగా రీడిజైన్ చేసి ఎర్గోనామిక్స్‌ను మెరుగుపరిచారు. మెరుగైన సర్ఫెస్ క్వాలిటీ, అప్‌గ్రేడెడ్ మెటీరియల్స్, రీడిజైన్ చేసిన సీటింగ్ అన్ని కలిపి కొత్త సెల్టోస్ కేబిన్‌ను మరింత ప్రీమియమ్‌గా మార్చాయి. డ్యుయల్ టోన్ అప్‌హోల్స్‌ట్రీ, డిజిటల్ ఇంటర్‌ఫేస్ అప్‌డేట్స్ ప్రివ్యూ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా కూడా కొత్త జనరేషన్ సెల్టోస్‌లో గణనీయమైన అప్‌గ్రేడ్స్ రానున్నాయి. కనెక్టివిటీ ఫీచర్లు మరింత పెరిగి, ADAS సేఫ్టీ సూట్‌లో కూడా కీలక మెరుగుదలలు చేర్చే అవకాశం ఉంది.

Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?

ఇంజన్ విషయంలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పేట్రోల్, 1.5-లీటర్ టర్బో పేట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు కొనసాగనున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. కియా భారత మార్కెట్‌లోకి సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇది కియా గ్లోబల్ హైబ్రిడైజేషన్ స్ట్రాటజీకి అనుగుణంగా ఉంటుంది. ఇక మాన్యువల్, iMT, ఆటోమేటిక్ ప్రస్తుత మోడల్‌లో ఉన్న ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కొత్త జనరేషన్‌లో కూడా కొనసాగుతాయని అంచనా. కొత్త తరం Kia Seltos ధర పరంగా కూడా ఇదే సెగ్మెంట్‌లో ఉండవచ్చు. అయితే అప్‌డేటెడ్ డిజైన్, ఆధునిక ఇంటీరియర్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, హైబ్రిడ్ ఆప్షన్‌తో SUV ఆకర్షణ మరింత పెరుగుతుంది. డిసెంబర్ 10న జరగబోయే అధికారిక ఆవిష్కరణలో పూర్తి స్పెసిఫికేషన్లు, వేరియంట్ వివరాలు, లాంచ్ ప్లాన్‌లు ప్రకటించనున్నారు.

Exit mobile version