NTV Telugu Site icon

Suryapet Highway : ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు తీరనున్న కష్టాలు

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట హైవే పై ఎంట్రీ వద్ద ఫ్లై ఓవర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఫ్లై ఓవర్ మంజూరుకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో చర్చించగా ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఎన్ఎచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో.. ఫ్లై ఓవర్ మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు ప్రారంభించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు కోరారు. సూర్యాపేట టూ దేవరపల్లి నేషనల్ హైవేలో భాగంగా నిర్మాణం చేసిన రహదారి ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ ఖమ్మం నుంచి సూర్యాపేట వచ్చే వాహనాలు విజయవాడ టూ హైదరాబాద్ హైవే పై ఎంట్రీ వద్ద సూర్యాపేట వైపు మళ్ళీ ముందుకు వెళ్ళాక యూ టర్న్ తీసుకుని హైదరాబాద్ వైపు రావల్సిన పరిస్థితి ఉంది.

Vegetarian Orders: వెజ్‌ ఫుడ్‌కి ఫుల్‌ డిమాండ్‌.. టాప్‌ 3లో హైదరాబాద్‌.. ఎక్కువ ఆర్డర్లు వీటికే..

అయితే.. యూ టర్న్ కష్టాలు లేకుండా మంత్రి తుమ్మల చొరవ తీసుకొని ఫ్లై ఓవర్ నిర్మాణంతో వాహనదారులు ఈజీగా ప్రయాణం చేసేలా సౌకర్యం ఉంటుందనీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డితో ప్రతిపాదిత ఫ్లై ఓవర్ పై చర్చించగా ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఇరువురు మంత్రులు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు చేపట్టాలని కోరారు. ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఆమోదం తెలిపి ఫ్లై ఓవర్ మంజూరు చేసింది నేషనల్ హైవే అథారిటీ. ప్రయాణంలో సౌకర్యంతో పాటు ఎలాంటి యాక్సిడెంట్ లు లేకుండా ఉండటం కోసం ఫ్లై ఓవర్ ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు..

Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యలో మా ప్రమేయం లేదు: అమెరికా..