Site icon NTV Telugu

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ఫీచర్‌..

Instagram

Instagram

New Feature in Instagram

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. ఆకర్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను లాంఛ్‌ చేయనుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్‌, వీడియో రీల్స్‌, చాటింగ్‌ వంటివాటితో యూజర్లను ఆకర్షిస్తున్న ఇన్‌స్టా.. తాజాగా మ్యాప్స్ ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చని ఇన్‌స్టా తెలిపింది. ఇన్‌స్టా ఐజీ లో కొత్తగా మ్యాప్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్‌ చేసిన పోస్ట్‌లను మాత్రమే చూడగలిగేవారని.. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదన్నారు మార్క్ జుకర్‌బర్గ్.

 

అయితే ఇన్‌స్టాలో రాబోయే లేటెస్ట్ అప్‌డేట్ మ్యాప్‌ ఫీచర్‌ ద్వారా లోకేషన్‌ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్‌ ఫీచర్‌ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్‌ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్‌ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్‌లు, బార్‌లు, పార్కులు లేదా ఇతర స్థలాలను ఎంచుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

 

Exit mobile version