EPF: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. ఇకపై చికిత్స కోసం ఎంత తీసుకోవచ్చంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎఫ్ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈపీఎఫ్ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసమే అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌లో వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి
Also Read
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్‌లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందొచ్చు. 2024, ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఉద్యోగి 6 నెలల బేసిక్, డీఏ లేదా వడ్డీతో సహా ఉద్యోగి వాటా ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేయలేరు. అంటే ఈ మొత్తానికి మించి మీ PFలో రూ. 1 లక్ష ఎక్కువగా ఉంటే మాత్రమే దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.లేదంటే కుదరదు.
ఇది కూడా చదవండి: TMC manifesto: సీఏఏ, ఎన్ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!