NTV Telugu Site icon

G-20: ఢిల్లీలో జీ-20 సదస్సు.. కోతులను తరిమేందుకు అధికారుల పాట్లు

Monkey

Monkey

G-20 Summit: ఈ ఏడాది భారత్ లో జీ-20 కూటమి సమావేశాలు జరనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు కోతులు ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీలో సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది.  ఢిల్లీలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటి వల్ల ఇబ్బంది కూడా పడ్డారుు. అయితే జీ-20 సమావేశాలను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా వీటి వల్ల ఎవరికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుంది.  జీ-20 సమావేశాల సందర్భంగా విదేశీ అతిధులకు కోతుల వల్ల ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసేందుకు న్యూఢిల్లీమున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సిద్ధమైంది. అటవీ శాఖ సిబ్బందితో కలిసి చర్యలు ప్రారంభించింది. జీ-20 సమావేశాలు జరిగే వేదిక వద్ద, విదేశీ అతిధులు ఉండే హోటల్స్ వద్ద విదేశీ అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు  తీసుకుంటున్నారు.

Also Read: Viral Video : మీ తెలివి తెల్లారా.. ఇలా తయారైయ్యారేంట్రా బాబు..

ఈ కారణంగానే కోతులను తరిమేందుకు కొంతమంది ప్రత్యేక ఉద్యోగులను ఎంపిక చేసింది ఢిల్లీ ప్రభుత్వం. కొండముచ్చుల్లా అరిచే వారిని ఉద్యోగం లోకి తీసుకున్నారు. కొండముచ్చులు  అంటే కోతులకుసాధారణంగా  భయం ఉంటుంది. కొండముచ్చుల్లా అరిచే ప్రత్యేక సిబ్బందిని నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. అంతేకాకుండా అక్కడక్కడ కొండముచ్చుల బొమ్మల కూడా ఏర్పాటు చేస్తామని దానివల్ల కోతులు వాటిని చూసి భయపడి రాకాకుండా ఉంటాయని కూడా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి.  భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సమావేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తోంది.  జీ-20 లో 19 దేశాలు ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సభ్యత్వం కల్గి ఉన్నాయి. ప్రపంచ జీడీపీ లో 85% కలిగి ఉన్న జీ-20 దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీ-20 దేశాల్లో నివసిస్తున్నారు. ఉన్నారు. ఈ సమావేశాలు మొదట్లో ఇండోనేషియాలో నిర్వహించాలని భావించినా, కొన్ని కారణాలతో వీటిని భారత్ లోని ఢిల్లీలో నిర్వహించనున్నారు.