New Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే:
* జ్వరం
* కారుతున్న ముక్కు
* గొంతు మంట
* తలనొప్పులు
* కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర సమస్యలు
* విపరీతమైన అలసట
* అలసట మరియు కండరాల బలహీనత
లక్షణాలు రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రమే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యస్వామినాథన్ మాట్లాడుతూ.. కోవిడ్ ని సాధారణ జలుబుగా కొట్టిపారేయొద్దని హెచ్చరించారు. ప్రజలు జబ్బు పడటమే కాకుండా.. దీనితో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. JN.1 అనే కొత్త వేరియంట్ కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్‌కి ఉప వేరియంట్. కాబట్టి ఇది ఓమిక్రాన్ వేరియంట్ వలే ప్రవర్తించే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ కొత్త వేరియంట్ మన ఆరోగ్య వ్యవస్థలోని యాంటీబాడీల ప్రతిస్పందన నుంచి తప్పించుకోగలనది. దీంతో గతంలో కోవిడ్ సోకిన వారికి కూడా మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.