NTV Telugu Site icon

Charminar: భాగ్యలక్ష్మి ఆలయంలో నూతన ఎమ్మెల్సీలు పూజలు..

Baghya Laxmi

Baghya Laxmi

హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య పూజలు చేశారు. వారితో పాటు పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదంతో రెండు ఎమ్మెల్సీల్లో విజయం సాధించామని అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తామని పాయల్ శంకర్ పేర్కొన్నారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపు మేధావులకే అంకితమని చెప్పారు. బండి సంజయ్ చెప్పినట్టుగా బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా చేస్తామని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో గెలిచాం.. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీని గెలిపించారని పేర్కొ్న్నారు. ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు.. గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేసిందని అంజిరెడ్డి ఆరోపించారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌