NTV Telugu Site icon

Apsara Case: ఏంటి ఈ ట్విస్ట్.. అప్సరకు ఇంతకు ముందే పెళ్లయిందా..!

Apsara

Apsara

అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్సరను చూసి చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అయితే అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఒక ఆడియోను విడుదల చేసింది. తన కుమారుని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె వెల్లడించారు.

Read Also : Gujarat : గుజరాత్‌లో 26/11 తరహాలో దాడికి యత్నం.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

పెళ్లైన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలంటూ టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారని ఆడియోలో ధనలక్ష్మి తెలిపింది. తన కొడుకుతో రోజు గొడవలు పడే వారిని ఒకరోజు తన కుమారుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడని ఆమె అన్నారు. కార్తీక్ రాజాను అరెస్టు చేసి జైల్లో పెట్టారని వెల్లడించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను మానసికంగా కృంగిపోయాడని వెల్లడించింది. ఆ అవమానాన్ని భరించలేక కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని ధనలక్ష్మీ తెలిపింది.

Read Also : Nithin : ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేయబోతున్న నితిన్..?

అయితే తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లి అరుణానే కారణమని కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియోలో తెలిపారు. అప్పటి నుంచి అప్సర, అరుణ ఇద్దరూ కనిపించకుండపోయారని ఆమె పేర్కొన్నారు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నానని తెలిపారు. అప్సర, ఆమె తల్లి అరుణ హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదన్నారు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదన్నారు. అందుకోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని తాను భావిస్తున్నానని ధనలక్ష్మి ఆడియోలో తెలిపింది.

Show comments