Site icon NTV Telugu

Ind Vs Pak: పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే రాత్రి నాకు నిద్ర పట్టలేదు..

Iyyaer

Iyyaer

టీమిండియా బ్యాటర్‌ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టుతో చేరాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఆసియా కప్‌-2023లో తమ ఆరంభ మ్యాచ్‌ సందర్భంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుతో రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో దాయాదుల పోరు ఆరంభానికి ముందు అయ్యర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను ఆసియా కప్‌ టోర్నీ ఆడతానని అస్సలు అనుకోలేదన్నాడు. కాగా, స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్టు సందర్భంగా అయ్యర్‌కు వెన్నునొప్పితో జట్టుకు దూరం అయ్యాడు.

Read Also: Viral Video : ఏంది సామి ఇది.. బాత్రూమ్ కోసం ఇంతగా కొట్టుకోవాలా..

ఇక సర్జరీ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో శ్రేయస్‌ అయ్యర్‌ పునరావాసం పొందాడు. అక్కడే నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు ప్రారంభించిన.. క్రమంగా ఫిట్‌నెస్‌ సాధించాడు. ఆసియా కప్‌ ఈవెంట్‌కు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టి మెగా టోర్నీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాలను గుర్తు చేసుకున్న అయ్యర్‌.. పూర్తిగా కోలుకోవడానికి చాలా టైం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: తగ్గిన వర్షం.. తిరిగి ప్రారంభమైన మ్యాచ్

సెలక్షన్‌కు వారం ముందు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో సక్సెస్ కావడం.. నాకెంతో సంతోషాన్నిచ్చింది అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. నిజానికి నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను అని అతడు వెల్లడించాడు. ప్రస్తుతం వాళ్లు నంబర్‌-1 జట్టుగా కొనసాగుతున్నారు.. అలాంటి పాక్ టీమ్ తో పోటీ మరింత ఉత్సాహాన్నిస్తుందన్నాడు. ఇక.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ కెప్టెన్సీలో జట్టు రోజురోజుకూ పురోగతి సాధిస్తోంది అని అయ్యర్ చెప్పాడు. డ్రెస్సింగ్‌రూంలో వాతావరణం చాలా బాగుంటుంది అని తెలిపాడు.

Read Also: Karumuri Nageshwara Rao: చంద్రబాబుపై మంత్రి కారుమూరి సీరియస్ కామెంట్స్

ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేస్తా.. ఆఫ్రిది, నసీం, రవూఫ్‌లను ఎదుర్కొంటామని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్ల తర్వాత జట్టులోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందంటూ శ్రేయస్‌ అయ్యర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, పాక్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రెండు సార్లు వరణుడు మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. ఇప్పటికి భారత్‌ 63 పరుగులకే కీలకమైన 4 వికెట్లు పడ్డాయి.

Exit mobile version