Never Ducked In ODIs: క్రికెట్ అనే మతం ఉంటే ఆ మతస్తులు మన దేశంలోనే ఎక్కువ మంది ఉంటారనే ఫేమస్ మీమ్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతలా ఈ క్రికెట్‌ను మన దేశంలో ఆదరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్‌కు ఇండియాలో ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే దేశంలో కూడా ఉన్నట్లు కనిపించదు. మీకు తెలుసా.. రసవత్తరంగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన ఎంతో మంది క్రీడాకారులు మనకు తెలుసు. కానీ వన్డే క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ కూడా సున్నా వద్ద ఔట్ కాని ప్లేయర్స్ ఎంత మందో తెలుసా. పెద్దగా ఆలోచించకండి ఈ లిస్ట్‌లో నలుగురే ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వీరిలో ఓ భారతీయ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఈ ప్లేయర్స్ ఎప్పుడూ కూడా తన వన్డే కెరీర్‌లో సున్నా వద్ద అవుట్ కాలేదు. అసలు ఏంటీ రికార్డ్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: ప్రయాణీకుడిని కొట్టిన కండక్టర్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఎక్కడంటే…
వీళ్ల కెరీర్‌లో నో డక్ అవుట్..
హేమాహేమీలకు సాధ్యం కాని ఒక ఫిట్‌ను ఇండియన్ క్రికెటర్ తన పేరు మీద లిఖించుకున్నాడు. ఆయన ఎవరో కాదు మాజీ లెజెండరీ ఆటగాడు యశ్‌పాల్ శర్మ. ఆయన తన కెరీర్‌లో ఆడిన 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. వీటిల్లో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆయనకు వన్డేల్లో అత్యధిక స్కోరు 89 పరుగులు. యశ్‌పాల్ శర్మ ఆడే సమయంలో చాలా డేంజరస్ జట్టుగా వెస్టిండీస్ జట్టుకు పేరుంది. ఆ దేశ బౌలర్లు ఎంతో ప్రమాదకరమైన వారనే పేరున్న సమయంలో ఈ భారత బ్యాట్స్‌మన్ వన్డేల్లో ఎప్పుడూ డకౌట్ కాకపోవడం విశేషం.
మిగిలిన వాళ్లు ఎవరో చూసేద్దామా..
కెప్లర్ వెస్సెల్స్ (దక్షిణాఫ్రికా): కెప్లర్ వెస్సెల్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండింటి తరపున క్రికెట్ ఆడాడు. ఆయన తన 10 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 109 వన్డేలు ఆడాడు. ఇందులో ఆయన 1 సెంచరీ, 26 అర్ధ సెంచరీల చేయడంతో మొత్తం 3367 పరుగులు చేశాడు. ఆయనకు వన్డేల్లో అత్యధిక స్కోరు 107 పరుగులు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ సున్నాలో అవుట్ కాలేదు. మరో విశేషం ఏమిటంటే ఆయన తన వన్డేల్లో 7 సార్లు నాటౌట్‌గా నిలిచి రికార్డు నెలకొల్పాడు.
పీటర్ కిర్స్టన్ (దక్షిణాఫ్రికా): పీటర్ కిర్స్టన్ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్. ఈయన మూడేళ్లు క్రికెట్ ఆడాడు. ఆయన తన క్రికెట్ కెరీర్‌లో 40 వన్డేలు ఆడి 1293 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆయన వన్డేల్లో 6 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో కిర్‌స్టన్ అత్యధిక స్కోరు 97 పరుగులు. ఈ బ్యాట్స్‌మన్ వన్డేల్లో ఎప్పుడూ సున్నాకి అవుట్ కాలేదు.
జాక్వెస్ రోడ్లాఫ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జాక్వెస్ రుడాల్ఫ్ తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 45 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఇందులో ఆయన 1174 పరుగులు చేశాడు. వీటిల్లో 7 హాప్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈయన తన వన్డేల్లో 6 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో రుడాల్ఫ్ అత్యధిక స్కోరు 81 పరుగులు. ఆయన తన వన్డే కెరీర్‌లో ఎప్పుడూ కూడా సున్నాకి అవుట్ కాలేదు.
READ ALSO: Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..
