NTV Telugu Site icon

Hardik Pandya: హార్థిక పాండ్యాను ప్రశంసిస్తున్న నెటిజన్స్

Gt

Gt

ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. తద్వారా రెండో సారి IPL ఫైనల్‌లో చోటు సంపాదించింది. ఇది టైటాన్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కు వచ్చిన టీమ్ గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ వచ్చిన రెండవ సంవత్సరంలో రెండు సార్లు ఫైనల్ కు రావడం విశేషం. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది.

Also Read : Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి హెచ్‌ఎండీఏ లీగల్‌ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే..

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరం ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం కూడా ఫైనల్ లోకి అడుగు పెట్టింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది.. ఈ సారి ఫైనల్ లో గెలిచి మరోసారి చరిత్రను లిఖించగలుగుతుందా అనేది చూడాలి. నిన్న జరిగిన పోటీలో 5 సార్లు విజేత ముంబై ఇండియన్స్‌పై జట్టు 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ట్రోఫీని ఎత్తే దిశగా గుజరాత్ అడుగులు వేస్తుంది. ముంబై, సీఎస్కే తర్వాత వరుసగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన మూడవ జట్టుగా గుజరాత్ నిలిచింది.

Also Read : Visa ban: భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల రిజెక్ట్

శుబ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ స్కోరును ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్‌కు మెరుపు ఆరంభం అవసరం కాగా.. రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా నేహాల్ వధేరా వచ్చాడు. అయితే అతను ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇషాన్ కిషన్‌ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫైనల్ రేసులో నిలిచింది. కానీ అతను ఔట్ అయిన తర్వాత MI యొక్క అవకాశాలు శూన్యమయ్యాయి. ఫలితంగా జట్టు 171 వద్ద ఆల్ అవుట్ అయింది.

Also Read : Youtube : ఇకనుంచి యూట్యూబ్ లో ఆ ఆప్షన్ కనిపించదు

గుజరాత్ టైటాన్స్ విజయం తర్వాత, ఆ జట్టును నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శుబ్ మాన్ గిల్ బ్యాటింగ్ తో పాటు ఫైనల్‌కు జట్టును నడిపించినందుకు హార్దిక్ పాండ్యాను కూడా ప్రశంసించారు. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రేపు మార్క్యూ క్లాష్ జరుగుతుంది. రేపు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.