Netherlands qualify ICC ODI World Cup 2023 after Beat Scotland: భారత గడ్డపై జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దాంతో అయిదోసారి మెగా టోర్నీలో పోటీపడే అవకాశం కొట్టేసింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత డచ్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడబోతుంది. బాస్ డె లీడ్ సెంచరీ (123; 92 బంతుల్లో 7×4, 5×6) సెంచరీ చేయడమే కాకుండా.. ఐదు (5/52) వికెట్స్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ములెన్ (106; 110 బంతుల్లో 11×4, 3×6) సెంచరీ బాదాడు. కెప్టెన్ బెరింగ్టన్ (64) హాఫ్ సెంచరీతో రాణించాడు. టోమస్ మాకింతోష్ (38), క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్ (32) రన్స్ చేశారు. నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డె లీడ్ 5 వికెట్స్ పడగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే.. నెదర్లాండ్స్ 44 ఓవర్లలోపే లక్ష్యాన్ని సాధించాల్సి వచ్చింది.
Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
లక్ష ఛేదనలో నెదర్లాండ్స్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు 60 పరుగులు చేశారు. సాఫీగా సాగుతున్న నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్ అడ్డుకున్నారు. దాంతో 31 ఓవర్లకు 164/5తో కష్టాల్లో పడింది. అప్పటికి బాస్ డె లీడ్ 52 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అందరూ నెదర్లాండ్స్ ఓటమి ఖాయం అనుకున్నారు. ఈ సమయంలో గేరు మార్చిన లీడ్… ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. సకీబ్ జుల్ఫికర్ (33 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. లీడ్ ఔట్ అయినా సకీబ్ మిగతా పని పూర్తిచేశాడు. దీంతో 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న నెదర్లాండ్స్ 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ ద్వారా శ్రీలంక ఇప్పటికే ప్రపంచకప్ 2023కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ (0.160), స్కాట్లాండ్ (0.102), జింబాబ్వే (-0.099) జట్లు తలో 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇదివరకు 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్‌లలో నెదర్లాండ్స్ ఆడింది.
Also Read: Delhi: ఢిల్లీలో ఓ మహిళ మూడేళ్లపాటు 14కుక్కలను ప్లాట్లో బంధించి ఘోరం