Site icon NTV Telugu

Netherlands vs Nepal: T20 క్రికెట్‌లో అతిపెద్ద ‘సూపర్’ డ్రామా… మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు..

Netherlands Vs Nepal

Netherlands Vs Nepal

క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే, ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఒక మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు ఆడితే ఏమి జరుగుతుందో ఊహించుకోండి? ఇలాంటిదే జరిగింది. ఇది ప్రతి క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరిచింది. నెదర్లాండ్స్, నేపాల్ మధ్య T20 మ్యాచ్ లో జరిగింది.

Also Read:Gold Rates: ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన పసిడి ధరలు.. రూ. 1140 తగ్గిన తులం గోల్డ్ ధర

నేపాల్ vs నెదర్లాండ్స్ (NED vs NEP T20 క్రికెట్ మ్యాచ్) మధ్య జరిగిన మ్యాచ్‌లో, ఒకటి కాదు, మూడు సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. చివరి సూపర్ ఓవర్‌లో, ఐదు బంతులు మిగిలి ఉండగానే మైఖేల్ లెవిట్ ఆరు పరుగులు చేయడంతో మ్యాచ్ ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది, దీనిలో బాస్ డి లీడే (35) మరియు విక్రమ్‌జిత్ సింగ్ (30) ఇన్నింగ్స్‌లు ఆడారు. నెదర్లాండ్స్ మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ నేపాల్ హోరాహోరీగా పోరాడింది. చివరి ఓవర్లో నందన్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, చివరి బంతికి ఫోర్ కొట్టి స్కోరును సమం చేశాడు. దీని కారణంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ తరపున కెప్టెన్ రోహిత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు.

Also Read:SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?

3 సూపర్ ఓవర్ల స్కోరు

తొలి సూపర్ ఓవర్‌లో నేపాల్ 19/1 స్కోరు చేయగా, నెదర్లాండ్స్ మైఖేల్ (6*), (12*) రాణించడంతో 19 పరుగులు చేసి తొలి సూపర్ ఓవర్‌లో మ్యాచ్‌ను టై చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్ చేసి 17/2 స్కోరు చేసింది. నేపాల్ తరపున రోహిత్ (7* పరుగులు), దీపేంద్ర (10*) సహాయంతో నేపాల్ 17 పరుగులు చేసింది. మ్యాచ్‌ మూడో సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. మూడో సూపర్ ఓవర్ నేపాల్ కు నిరాశ మిగిల్చింది. కెప్టెన్ రోహిత్ (0), దీపేంద్ర (0), రూపేష్ (0) ఔటయ్యారు. నెదర్లాండ్స్ జట్టుకు చెందిన మైఖేల్ ఒక సిక్స్ కొట్టి ఐదు బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ట్రిపుల్ సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్ లో నేపాల్ పై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది.

Exit mobile version