NTV Telugu Site icon

Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్‌.. పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు ఛార్జీలు బాదుడే..

Netflix

Netflix

Netflix: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నష్టాలను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను షేర్‌ చేయకుండా ఆపేందుకు ప్లాన్స్ రచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ యూజర్ల నుంచి త్వరలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా పాస్‌వర్డ్‌లు షేర్‌ చేసే అకౌంట్స్‌ను మానిటైజ్‌ చేస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ తన క్యూ3 ఫలితాలను విడుదల చేసింది. ఆదాయపరంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ సబ్‌స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగింది.

అందుకు పాస్‌వర్డ్‌ షేరింగ్ కారణమని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇప్పుడు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీల నిబంధన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసే అకౌంట్లపై ఎక్స్‌ట్రా ఛార్జీ విధిస్తామని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అకౌంట్ షేరింగ్‌ను మానిటైజ్‌ చేయడానికి కొత్త విధానాన్ని ప్రారంభించామని ప్రకటించింది. 2023 ప్రారంభంలో దీనిని మరింత విస్తృతంగా అందరికీ వర్తింపజేస్తామని నెట్‌ఫ్లిక్స్ ఓ నివేదికలో పేర్కొంది.

Dengue Patient: డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌.. వీడియో వైరల్

నెట్‌ఫ్లిక్స్‌ అనుసరిస్తున్న ఈ మార్గం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక యూజర్‌ తన పాస్‌వర్డ్‌ను మరొకరికి షేర్‌ చేసిన ప్రతిసారీ కంపెనీ అదనపు ఛార్జీ విధించనుంది. దీనర్థం నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను ఇద్దరు ఫ్రెండ్స్‌తో షేర్ చేసే సబ్‌స్క్రైబర్, రెండుసార్లు నెట్‌ఫ్లిక్స్‌కి అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రా ఫీజు చెల్లించ కూడదు అనుకుంటే, వారు తమ ఫ్రెండ్స్‌కి ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ సజెస్ట్ చేయవచ్చు. అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎలాంటి రికమండేషన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పొందారో అదే రికమండేషన్స్‌తో కొత్త ప్రీమియం అకౌంట్ తీసుకోవచ్చు. చాలా కాలంగా యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తుండడం వల్ల నెట్‌ఫ్లిక్స్ ఆదాయ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసే యూజర్ల నుంచి నెట్‌ఫ్లిక్స్ ఎంత ఛార్జ్ వసూలు చేస్తుందో ప్రకటించలేదు.