NTV Telugu Site icon

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం.. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్‌ బంద్!

Netflix

Netflix

Netflix has ended password sharing in India: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘నెట్‌ఫ్లిక్స్‌’ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్ దేశంలో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ మెయిల్స్ పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా తీసుకుంటారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా ఉపయోగించుకునే వారికి షాక్ తగినట్లైంది.

మనలో చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ పని చేసే విధానం గురించి అవగాహన ఉంది. ఒక వ్యక్తి బిల్లులు చెల్లిస్తే.. అతడితో పాటు చాలా మంది ఆ ఖాతాను ఉపయోగిస్తున్నారు. చాలా కాలంగా ఇలాగే జరుగుతోంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతీయులకు మొదటి ఎంపికగా మారినప్పటినుంచి ఇదే ప్రాసెస్ జరుగుతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్థి పలుకుతోంది. పాస్‌వర్డ్‌ షేరింగ్ విధానాన్ని భారత్‌లో నిలిపివేయనుంది. నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై ఓటీటీ సేవలు వినియోగించుకోవచ్చు.

ఈ నిర్ణయాన్ని నెట్‌ఫ్లిక్స్ అకస్మాత్తుగా, హెచ్చరిక లేకుండా తీసుకున్నది మాత్రం కాదు. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ త్వరలో ముగించనుందని, త్వరలోనే చర్యలు తీసుకుంటుందని చాలా కాలంగా పలు నివేదికలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 100కు పైగా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని మే నెలలోనే కంపెనీ ప్రకటించింది. చివరకు నెట్‌ఫ్లిక్స్ ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం ఉన్న సబ్యులకు త్వరలోనే ఈ ఇమెయిల్‌లు వెళ్లనున్నాయి.

Also Read: Fisker Ocean EV Launch: ఒక్కసారి చార్జ్ చేస్తే 707 కిమీ ప్రయాణం.. సోలార్ ప్యానెల్ రూఫ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ కారు!

కస్టమర్ల అభిరుచి, బాష, సంతృప్తి మేరకే పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఖాతా దారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సదుపాయం పొందవచ్చని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్‌ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను కుటుంబ సభ్యులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో నెట్‌ఫ్లిక్స్ తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది. ఇక పాస్‌వర్డ్ షేరింగ్‌ తీసుకు వచ్చిన నేపథ్యంలో దాదాపు 60 లక్షల మంది కొత్త ఖాతాలు వచ్చాయట.

Also Read: IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్‌ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!