NTV Telugu Site icon

Netflix Free Plan: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీ ప్లాన్!

Netflix

Netflix

Netflix plans to introduce Free Ad-Supported Plan: ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’ తన సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను పెంచుకునే దిశగా దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్రీ ప్లాన్‌’ను తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం యాడ్స్‌ను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్‌ను తీసుకొస్తారని ఓ నివేదిక పేర్కొంది.

ఆసియా, యూరోపియన్‌ దేశాల్లో ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక తెలిపింది. టీవీ ఛానెల్స్‌ ఉచితంగా లభిస్తున్న దేశాల్లో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోందట. ఏ దేశాల్లో తీసుకొస్తారనేది మాత్రం బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించలేదు. కెన్యాలో ఈ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన నెట్‌ఫ్లిక్స్‌.. ఆపై నిలిపివేసింది. అమెరికాలో మాత్రం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

Also Read: Lifestyle : ఈ కారణాల వల్లే ఆడవాళ్లు పెళ్లంటే భయపడుతున్నారట..

నెట్‌ఫ్లిక్స్‌ తన సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడంలో భాగంగానే ఈ వ్యూహం ఈ ప్లాన్‌ను అమలు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎవరైతే డబ్బులు చెల్లించి కంటెంట్‌ను వీక్షించలేరో.. వారిని యాడ్స్‌తో కూడిన ఫ్రీ ప్లాన్‌ ద్వారా చేరువ అవ్వాలని భావిస్తోందట. దాంతో ప్రకటనల ఆదాయం కూడా పెరగనుంది. యూట్యూబ్‌ ఓ వైపు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పెంచుకోవడంపై దృష్టిసారిస్తుండగా.. అడ్వర్టైజ్‌మెంట్‌ ఆదాయాన్ని పెంచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ ఫోకస్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌పై అధికారికంగా నెట్‌ఫ్లిక్స్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.