Netflix Free Plan: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీ ప్లాన్!
- నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీ ప్లాన్
- యూరోపియన్ దేశాల్లో
- అడ్వర్టైజ్‌మెంట్ ఆదాయాన్ని పెంచుకోవడంపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix plans to introduce Free Ad-Supported Plan: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే దిశగా దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్రీ ప్లాన్’ను తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం యాడ్స్‌ను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్‌ను తీసుకొస్తారని ఓ నివేదిక పేర్కొంది.
ఆసియా, యూరోపియన్ దేశాల్లో ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. టీవీ ఛానెల్స్ ఉచితంగా లభిస్తున్న దేశాల్లో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోందట. ఏ దేశాల్లో తీసుకొస్తారనేది మాత్రం బ్లూమ్‌బెర్గ్ వెల్లడించలేదు. కెన్యాలో ఈ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన నెట్‌ఫ్లిక్స్.. ఆపై నిలిపివేసింది. అమెరికాలో మాత్రం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చే ఉద్దేశం లేదని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
Also Read
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
Also Read: Lifestyle : ఈ కారణాల వల్లే ఆడవాళ్లు పెళ్లంటే భయపడుతున్నారట..
నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడంలో భాగంగానే ఈ వ్యూహం ఈ ప్లాన్‌ను అమలు చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎవరైతే డబ్బులు చెల్లించి కంటెంట్‌ను వీక్షించలేరో.. వారిని యాడ్స్‌తో కూడిన ఫ్రీ ప్లాన్ ద్వారా చేరువ అవ్వాలని భావిస్తోందట. దాంతో ప్రకటనల ఆదాయం కూడా పెరగనుంది. యూట్యూబ్ ఓ వైపు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పెంచుకోవడంపై దృష్టిసారిస్తుండగా.. అడ్వర్టైజ్‌మెంట్ ఆదాయాన్ని పెంచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్ ఫోకస్ చేస్తోంది. ఈ ప్లాన్‌పై అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!