NTV Telugu Site icon

Israel-Lebanon Tension: ‘‘తగ్గేదే లేదు, పూర్తిశక్తితో హిజ్బుల్లాపై దాడి చేయండి’’.. ఆర్మీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆదేశాలు..

Israel Lebanon Tension

Israel Lebanon Tension

Israel-Lebanon Tension:ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇరు దేశాలు 21 రోజులు పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. అయితే, ఈ పిలుపుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించలేదు. మిత్ర దేశాల ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఇయన చెప్పారు.

Read Also: India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!

‘‘ఇది అమెరికా-ఫ్రాన్స్ ప్రతిపాదన, దీనికి ప్రధాని నెతన్యాహూ స్పందించలేదు’’ అని నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉంటే, హిజ్బుల్లాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సైన్యానికి నెతన్యాహూ పిలిపునిచ్చాడు. పూర్తి శకత్తితో దాడి చేయాలని సైన్యాన్ని గురువారం ఆదేశించాడు. లెబనాన్ పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తి చేశారు. దౌత్యపరంగా సమస్యని పరిష్కరించుకోవడానికి లెబనాన్-ఇజ్రాయిల్ సరిహద్దుల్లో తక్షణమే 21 రోజులు కాల్పుల విరమణ పాటించాలని మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జపాన్, గల్ఫ్ దేశాలు, అమెరికా కాల్పుల ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేశాయి.

ఇదిలా ఉంటే, లెబనాన్‌పై భూతల దాడులతో పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం సైనికులకు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సాధ్యమైన భూదాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీని తర్వాతే కాల్పుల విమరణ పాటించాలని పలు దేశాలు కోరాయి. ఇదిలా ఉంటే హిజ్బుల్లా బుధవారం టెల్ అవీల్‌లోని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మెస్సాద్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేసింది.