Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్ నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలోని ఉన్న ఒక పాఠశాల నిమిషాల వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో 1,643 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 9:20 గంటల సమయంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీకి ఓ స్నేహితుడి నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఎగువన ఉన్న గ్రామం కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. మొదట్లో నదికి 60 మీటర్ల ఎత్తులో ఉన్న మూడు అంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని ప్రిన్సిపాల్ దవాడీ భావించినా, నిమిషాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. వెంటనే స్పందించిన ఆయన ఆలస్యం చేయకుండా పాఠశాల గంట మోగించి, ఉపాధ్యాయుల సహాయంతో తరగతులను ఖాళీ చేయించారు. మార్గమధ్యంలో ఉన్న బస్సులను వెనక్కి మళ్లించగా, అప్పటికే వంతెన దాటుతున్న ఒక బస్సును మాత్రం ఆపలేకపోయారు. భయంతో స్పృహతప్పి పడిపోయిన ఓ విద్యార్థినిని వెంటనే బైక్‌పై సురక్షిత ప్రాంతానికి తరలించగా, మిగిలిన పిల్లలందరినీ కొండపైకి పరుగులు తీయించారు. అందరికంటే చివర్లో నడుస్తూ ఏ ఒక్క చిన్నారి వెనుకబడిపోకుండా దవాడీ పర్యవేక్షించారు.
విద్యార్థులందరూ కొండపైన ఉన్న ఒక రావి చెట్టు వద్దకు చేరుకుని ఊపిరి పీల్చుకుంటుండగానే, ఉగ్రరూపం దాల్చిన వరద ప్రవాహం విరుచుకుపడింది. క్షణాల్లో ఆ మూడు అంతస్తుల భవనాన్ని మట్టి, రాళ్ల ప్రవాహం మింగేసింది. కొద్ది నిమిషాల క్రితం విద్యార్థులతో కిటకిటలాడిన ప్రదేశం బురద మయంగా మారింది. దవాడీ సమయస్ఫూర్తి వల్ల 1,643 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. అయితే, తనతో పాటు పనిచేసే ఇద్దరు సహచరులను కాపాడుకోలేకపోయాననే బాధ ఆయనను కలచివేసింది. ఉదయం టిఫిన్ చేయడానికి నది ఒడ్డున ఉన్న గదికి వెళ్లిన 32 ఏళ్ల చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్ వరదలో కొట్టుకుపోగా, పాఠశాల తలుపులు వేయడానికి వెళ్లిన వాచ్‌మన్ సుల్తాన్ లామా కూడా ప్రాణాలు కోల్పోయారు. 1,643 కుటుంబాల్లో వెలుగులు నిలిపిన దవాడీని అందరూ ఒక దేవదూతుడిలా చూస్తున్నప్పటికీ, ఆ క్షణంలో పిల్లలను కాపాడటం తప్ప తనకు వేరే మార్గం కనిపించలేదని ఆయన చాలా సాధారణంగా చెప్పారు.
Also Read
- China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ఈ దారుణ విపత్తుకు నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద చోటుచేసుకున్న ఘటనే కారణం. అక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో (లండన్‌లోని గ్రీన్ పార్క్ పరిమాణంలో) ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగి దాదాపు 1,200 మీటర్ల కిందకు పడటంతో లెండే నది ఉప్పొంగింది. నదీ ప్రవాహంతో పాటు మంచు, రాళ్లు, బురద విపరీతమైన వేగంతో కొట్టుకొచ్చి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతానికి ఇలాంటి ముప్పు కొత్తేమీ కాదు. ఏప్రిల్ 2015లో వచ్చిన 7.8 తీవ్రత కలిగిన వినాశకరమైన భూకంపం కారణంగా లాంగ్టాంగ్లో సంభవించిన హిమపాతం 300 మంది ఉన్న ఒక ఇలాలినే మట్టికింద పూడ్చిపెట్టింది. అప్పట్లో దాదాపు 8,962 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కూడా అదే హిమాలయ ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడినా, సమయానికి అందిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే అంతమంది ప్రాణాలు దక్కాయి. విపత్తు నిర్వహణలో కేవలం యంత్రాలు, సహాయక బృందాలే కాకుండా సకాలంలో తీసుకునే సాహసోపేత నిర్ణయాలు ఎంతటి ఘనకార్యాన్ని సాధించగలవో రాజేంద్ర దవాడీ చర్య నిరూపించింది.
తాజావార్తలు
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!