NTV Telugu Site icon

Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్ బుక్‎లో లైవ్ స్ట్రీమింగ్

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal Plane Crash : నేపాల్‌లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల ప్యాసింజర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులోని 68 ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది మృతి చెందారు. అయితే, విమానం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు విమానంకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Also: Woman Hit By Car: వీధికుక్కల ఆకలి తీరుస్తున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

నేపాల్ విమాన ప్రమాద ఘ‌ట‌న‌ను ఇండియా ప్యాసింజర్ ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే ప్యాసింజ‌ర్ మ‌రికాసేప‌ట్లో విమానం మంట‌ల్లో చిక్కుకుంటుంది అన‌గా వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అందులో అత‌ను నవ్వుతూ క‌నిపించాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడ‌మ‌వైపు మ‌ళ్లింది. ఆ త‌ర్వాత నేల‌ను ఢీకొని, మంట‌లు వ్యాపిస్తాయి. ఈ దృశ్యాల‌న్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Read Also: Nirmala Sitharaman: నాదీ మధ్యతరగతే.. వారి సమస్యలేంటో తెలుసు

ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్‌కు చెందిన సోను జైస్వాల్, అనిల్ రాజ్‌భ‌ర్, విశాల్ శ‌ర్మ, అభిషేక్ సింగ్ లతో క‌లిసి జ‌న‌వ‌రి 13న నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండ్‌కు వెళ్లాడు. ఈ న‌లుగురు అక్కడ ప‌శుప‌తినాథ్ దేవాల‌యంలో పూజ‌లు చేసి… అనంత‌రం పారాగ్లైడింగ్ చేసేందుకు పొఖార బ‌య‌లుదేరారు. జ‌న‌వ‌రి 15 (ఆదివారం)న ఎతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌-72 (ATR-72) విమానం ప్రమాదానికి గురైంది. రెండు ఇంజిన్లు ఫెయిల్ కావ‌డం వ‌ల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు.

Show comments